Ads (728x90)



ఢిల్లీలోని నిర్భయ దారుణం హర్యానా రాష్ట్రంలో పునరావృతమైంది. ఒక రకంగా అంతకన్నా ఘోరంగా జరిగింది. ఆ దారుణానికి పాల్పడినవారిని మనుషులుగా కూడా గుర్తించడానికి వీలు లేని రీతిలో అతి భయంకరంగా ఆ దారుణం జరిగింది. పశువులు కూడా తలదించుకునే ఘోరమైన చర్యకు పాల్పడ్డారు. గుర్తు తెలియని కీచకులు 28 ఏళ్ల మానసిక స్థిమితం లేని మహిళ పట్ట సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే పద్ధతిలో వ్యవహరించారు. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమెను హత్య చేశారు. ఈ సంఘటన హర్యానాలోని రోహతక్ జిల్లా బహు అక్బర్‌పూర్‌లో జరిగింది.


టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం - మహిళ శవం కీలకమైన అంగాలు లేకుండా బుధవారం కనిపించింది. ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లో కర్రలు, రాళ్లు, కండోమ్స్ దూర్చారు. అదృశ్యమైన మూడు రోజుల తర్వాత అత్యంత దారుణమైన స్థితిలో ఆమె శవం కనిపించింది. శవం కుళ్లిపోయి ఉందని పోలీసులు చెబుతున్నారు. శవానికి పండిత్ భగవత్ శర్మ పోస్ట్ గ్రాడ్యుయెట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో గురువారంనాడు పోస్టుమార్టం చేశారు.


తన 29 ఏళ్ల కెరీర్‌లో 30 వేలకు పైగా శవపరీక్షలు నిర్వహించానని, ఇంత కిరాతకమైన కేసును ఇప్పటి వరకు చూడలేదని సంస్థ ఫోరెన్సిక్ మెడిసిన్ శాఖ అధిపతి డాక్టర్ ఎస్‌కె దత్తేర్వాల్ అన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. మహిళ గుదంలో రాళ్లు దూర్చారని ఆయన చెప్పారు. ఆమె ముఖాన్ని జంతువులు పీక్కు తిన్నాయి. ఊపిరితిత్తులు, గుండె భాగాలు కనిపించలేదు.


పుర్రె పగిలి ఉందని, ఆమె రెండు తొడలపై, ఛాతీపై గాయాలున్నాయని ఆయన చెప్పారు. వైద్యులు ఐదు గంటల పాటు శవపరీక్ష నిర్వహించారు. యోనిలో కర్రవంటి 16 సెంటిమీటర్ల పొడవు, 4 సెంటిమీటర్ల వస్తువు ఉంది. .యోనిలో పలు కండోమ్స్ కనిపించాయి.

మహిళ నేపాల్‌లోని వర్దియా జిల్లాకు చెందిందని పోలీసులు చెప్పారు. హల్దావానిీలో చికిత్స తీసుకుంటూ ఉండేది. నగరంలో ఇళ్లలో పని మనిషిగా చేస్తున్న తన సోదరిని చూడడానికి రోహతక్ వచ్చింది. నిందితుల గురించి ఏ విధమైన క్లూ లభించలేదని రోహతక్ ఎస్పీ శశాంక్ ఆనంద్ చెప్పారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లోన సిసిటీవీ ఫుటేజీలను పోలీసులు సేకరించారు.

Post a Comment