Ads (728x90)



యాడ్స్ అంటే ఓ వెరైటీ ఉండాలి. పాత చింతకాయ పచ్చడిలా ఉంటే ఎవరూ చూడరు. దానికి కాస్త మసాలా దట్టిస్తే అందరికి భలే నచ్చుతుంది. అయితే మసాలా కూడా పర్ ఫెక్ట్ గా సరిపోవాలి. తాజాగా ఓ యాడ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఓ బిజెపి ఎంపీ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. అసలు ఎవరూ ఊహించని ట్విస్ట్ తో తెరకెక్కిన ఈ యాడ్ అందరికి మంచి కిక్ ఇచ్చింది. 


ఇప్పటికే 50వేల వ్యూస్ ను సొంతం చేసుకున్న ఈ వీడియో వేగంగా షేర్ చేస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ ఆ యాడ్ లో ఏముంది అనుకుంటున్నారా..?అప్పట్లో.. 1990టైంలో వచ్చే సినిమాలు ఎంత డ్రమాటిక్ గా సాగుతాయో అదే స్టైల్లో సాగుతుంది ఈ యాడ్. ఓ జంట విడిపోతుంటారు. తన ప్రియురాలి జ్ఞాపకాలను చెరిపివెయ్యాలని అనుకుంటాడు హీరో. తనతో దిగిన ఫోటోనను చించేసి.. ఆ ఫోటో ముక్కలను మాత్రం జేబులో దాచుకుంటాడు. దాంతో హీరోయిన్ వాటిని ఎందుకు జేబులో ఉంచుకున్నావ్.. కిందపడేయ్ అని అంటుంది. 


దానికి హీరో ఇచ్చిన సమాధానం వింటే షాక్ అవుతారు.ప్రేమలో చెడు ఉండొచ్చు కానీ దేశంలో మాత్రం చెత్త ఉండనివ్వను(Love could turn dirty, but my country can’t) దాంతో మదోీ సర్కార్ స్టార్ట్ చేసిన స్వచ్ఛ భారత్ కు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థమవుతోంది. మామూలు యాడే కానీ కాస్త డిఫరెంట్ గా తీస్తే ఎంతో పాపులర్ అయింది.




Post a Comment